- Movie: Allari Priyudu
- Cast: Dr. Rajasekhar,Madhubala,Ramyakrishna
- Music Director: M M Keeravani
- Year: 1993
- Label: Aditya Music
Song: Em Pilladi
ఎం పిల్లది ఎంత మాటన్నది
ఎం కుర్రది కూత బాగున్నది
ఓయ్ సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది
చెక్కిలి పై కెంపులు నా సొంతం అంది
ఎక్కడ ఎం చెయ్యాలో నేర్పామన్నది
బాగున్నది కోడె ఈడన్నది
ఈడందుకే వీధి పాలైనది
కమ్మని కల కల్లెదుటకు వచ్చేసింది
కొమ్మకు జత వీడేనని వొట్టేసింది
ఎప్పుడు ఎం కావాలో అడగమన్నది
ఎం పిల్లది ఎంత మాటన్నది
బాగున్నది కోడె ఈడన్నది
శనివారం ఎంకన్న సామి పేరు చెప్పి
సెనగలడ్డు చేత బెట్టి సాగనంపింది
మంగళారం ఆంజనేయ సామి పేరు జెప్పి
అసలు పనికి అడ్డమేట్టి తప్పుకున్నాధీ
ఇనుకొ నీ ఆరాటం ఇబ్బంది
ఇడమారిసే ఈలెట్టా ఉంటుంది
ఎదలోనే ఓ మంట పుడుతుంది
పెదవిస్తే అది కూడా ఇమ్మంటుంది
చిరు ముద్దుకి ఉండాలి చీకటి అంది
ఏ కళ్ళు పడకుంటే ఓకే అంది
తీరా ముద్దిస్తుంటే ఎంగిలన్నది
ఎం పిల్లది ఎంత మాటన్నది
బాగున్నది కోడె ఈడన్నది
శుక్రారం మాలచ్చిమి నీకు సాటి అంటూ
పట్టు చీర తెచ్చి పైట చుట్టమన్నాడు
సోమవారం జామురాతిరి తెల్ల చీర తెచ్చి
మల్లెపూల కాపాడాలూ పెట్టమన్నాడు
ఉత్సాహం ఆపేది కాదంట
ఉబలాటం కసిరేస్తే పోదంట
ఉయ్యాలా జంపాల కథలోనే
ఊఉ కొట్టే ఉద్యోగం నాదంట
వరసుంటే వారంతో పని ఏముంది
ఉత్తుత్తి చొరవయితే ఉడుకెముంది
మల్లి కావాలన్నా మనసు ఉన్నది
వామ్మో ఎం పిల్లది ఎంత మాటన్నది
బాగున్నది కోడె ఈడన్నది
సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది
కొమ్మకు జత వీడేనని వొట్టేసింది
ఎక్కడ ఎం చెయ్యాలో నేర్పామన్నది
ఎం పిల్లది ఎంత మాటన్నది
బాగున్నది కోడె ఈడన్నది