- Movie: Allari Priyudu
- Cast: Dr. Rajasekhar,Madhubala,Ramyakrishna
- Music Director: M M Keeravani
- Year: 1993
- Label: Aditya Music
Song : Andamaa Nee Peremiti
అందమా నీ పేరేమిటి అందమా
అందమా నీ పేరేమిటి అందమా
ఒంపుల హంపి శిల్పమా
బాపు గీసిన చిత్రమా
తెలుపుమా తెలుపుమ తెలుపుమా
పరువమా నీ ఊరేమిటి పరువమా
పరువమా నీ ఊరేమిటి పరువమా
కృష్ణుని మధుర నగరమ
కృష్ణ సాగర కెరటామా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా
ఏ రవీంద్రుని భావమో
గీతాంజలి కల వివరించే
ఎండ తాకని పండు వెన్నెల
గగనమొళికే నా కన్నుల
ఎంకి పాటల రాగమే
గోదారి అలలపై నిదురించే
మూగబోయిన రాగమాలిక
ముసిరేనిపుడు నా గొంతున
సంగీతమా నీ నింగిలో
విరిసిన స్వరములే ఏడుగా
వినబడు హరివిల్లెక్కడ
తెలుపుమా తెలుపుమా తెలుపుమా
అందమా నీ పేరేమిటి అందమా
తెలుపుమా నీ ఊరేమిటి పరువమా
భావకవితాల బరువులో
ఆ కృష్ణశాస్త్రిల కవినైతే
హాయి రెమ్మల కోయిలమ్మకు
వీరుల ఋతువు వికసించద
తుమ్మెదడగాని మధువులే
చెలి సాకి వలపులే చిలికిస్తే
మాయ జగతికి ఏ ఖాయమో
మధుర కవిత వినిపించాడా
ఓ కావ్యమా నీ తోటలో
నవరస పోషణే గాలిగా
నవ్వినా పూలే మాలగా
పూజకే సాధ్యమా తెలుపుమా
అందమా నీ పేరేమిటి అందమా
అందమా నీ పేరేమిటి అందమా
ఒంపుల హంపి శిల్పమా
బాపు గీసిన చిత్రమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా