- Movie: Allari Priyudu
- Cast: Dr. Rajasekhar,Madhubala,Ramyakrishna
- Music Director: M M Keeravani
- Year: 1993
- Label: Aditya Music
Song : Aho Oka Manasuku
అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే ఇదే కుహు స్వరాల కానుక
మరో వసంత గీతికా జనించు రోజు
అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు
మాట పలుకు తెలియనిది
మాటున ఉండే మూగ మాది
కమ్మని తలపుల కావ్యమయే
కవితలు రాసే మౌనమది
రాగల రోజుల ఊహలకి
స్వాగతమిచ్చే రాగమాది
శృతిలయలేరుగాని ఊపిరికి
స్వరములు కూర్చే గానమది
ఋతువుల రంగులు మార్చేది
కల్పనా కలిగిన మది భావం
బ్రతుకును పాటగా మలిచేది
మనసున కదిలిన మృదునాదం
కలవని దిక్కులు కలిపేది
నింగిని నెలకి దింపేది
తానే కదా వారధి
క్షణాలకే సారధి మనస్సనేది
అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు
చూపులకెన్నడు దొరకనిది
రంగు రూపు లేని మాది
రెప్పలు తెరవని కన్నులకు
స్వప్నలెన్నో చూపినది
వెచ్చని చెలిమిని పొందినది
వెన్నెల కల గల నిండుమది
కాటుక చీకటి రాతిరికి
బాటను చూపే నేస్తమది
చేతికి అందని జాబిలిలా
కాంతులు పంచె మణిదీపం
కొమ్మల చాటున కోయిలలా
కాలం నిలిపే అనురాగం
అడగని వరములు కురిపించి
అమృతవర్షిణి అనిపించి
అమూల్యమైన పెన్నిధి
శుభోదయాల సన్నిధి మనస్సనేది
అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే ఇదే కుహు స్వరాల కానుక
మరో వసంత గీతికా జనించు రోజు