Abhishekam Movie Song Nalo ninu chusukoga
నాలో నిను చూసుకోగా
నాతో మురిపించుకోగా
ఒళ్ళో పాపాయివైనవమ్మా
నిత్యం కాపాడుతున్న నీల నే పెంచగలన
ఇంకా పసివాడినేగా అమ్మ
రామ రక్షా అని లాల పోసిన
శ్యామలాలి అని లాలీ పాడిన
బువ్వ పెట్టిన బుజ్జగించిన
చేయి పట్టుకుని నడక నేర్పిన
అమ్మను మించిన అమ్మని నే కాగలనా
నాలో నిను చూసుకోగా
నాతో మురిపించుకోగా
ఒళ్ళో పాపాయివైనవమ్మా
నువ్వు మేలుకొని ఉంటే నాకు అది పట్టపగటివేళ
ఆదా మరిచి నువ్వు నిద్దరోతే అది అర్ధరాత్రివేళ
నిన్ను మించి వేరే నా లోకమంటా లేదే
అలిగిన సమయాన్నే నడివేసవి అనుకొనా
కిల కిల నవ్వులనే చిరు జల్లులు అనుకొనా
చేసిన సేవలు నువ్ నేర్పినవే అమ్మ
నాలో నిను చూసుకోగా
నాతో మురిపించుకోగా
ఒళ్ళో పాపాయివైనవామ్మా
అమ్మ లాలన ఎంత పొందిన అంతనేది ఉందా
వేయి జన్మల ఆయువిచ్చిన చాలనిపిస్తుందా
అమ్మలేని బ్రహ్మ చేసేది మట్టిబొమ్మ
మనిషిగా మలిచేది కనీ పెంచు తల్లి మహిమ
మనసున నిలిచేది ఆ మాతృమూర్తి ప్రతిమ
దేవుడు సైతము కోరిన దీవెన అమ్మ
పాడే ఈ పాటా పేరు సాగే నా బాట పేరు
ఆగే ప్రతి చోటు పేరు అమ్మ
ఎదలో నాదాల పేరు కదిలే పాదాల పేరు
ఎదిగిన ఇన్నేళ్ల పేరు అమ్మ
అన్నమయ్య గీతాల భావన
త్యాగరాజు రాగాల సాధన
ఎన్ని పేర్ల దేవుణ్ణి కొలిచిన
తల్లి వెరుల వాటి చాటున
ఉన్నది ఒక్కటే కమ్మని పేరు అమ్మ
ఉన్నది ఒక్కటే కమ్మని పేరు అమ్మ
పాడే ఈ పాటా పేరు సాగే నా బాట పేరు
ఆగే ప్రతి చోటు పేరు అమ్మ