aanaya movie song Hae sayyaarae sayyaa

 Aannaya Movie Song Hae sayyaarae sayyaa



హే సయ్యారే సయ్యా నేనేరా అన్నయ్య భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య హే సయ్యారే సయ్యా నేనేరా అన్నయ్య భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య పెంచింది నన్ను మీ అభిమానము మీ తోడై ఉంటాను కలకాలము సరదాల సంతోషాలే సయ్యాటాడే సల్లాపంలో హే సయ్యారే సయ్యా నేనేరా అన్నయ్య భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య అన్నా తమ్ముళ్ళు ఈ అనుబంధమూ ఇలలో అందరికీ అది ఆదర్శము లోకం నా లోకం ఇక మీరేనురా ప్రాణం నా ప్రాణం మీ మీదేనురా వేళ్ళు ఒక్కటైతే అది ఉక్కు పిడికిలిరా అందరొకటైతే అగ్గిపిడుగేరా అభిమానం కురిపించే ఈ ఆంధ్రదేశం అంతా నాదే హే సయ్యారే సయ్యా నేనేరా అన్నయ్య భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య మీరే నా కళ్ళు ఇక ఏ నాటికీ మీరే తమ్ముళ్ళు ఇక ఏ జన్మకీ ఎపుడూ తీరని మీ ఋణమన్నదీ దైవం తెచ్చాడు ఈ వరమన్నదీ అన్న కన్నుల్లో వెలిగేటి దివ్వెలివీ అన్న గుండెల్లో పూచేటి పువ్వులివీ నామాటే వేధంగా నడిచేటి తమ్ముళ్ళంటే మీరే హే సయ్యారే సయ్యా నేనేరా అన్నయ్య భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య పెంచింది నన్ను మీ అభిమానము మీ తోడై ఉంటాను కలకాలము సరదాల సంతోషాలే సయ్యాటాడే సల్లాపంలో