Meaning of Love Languages: ఇద్దరు వ్యక్తుల మధ్య స్వచ్ఛమైన వాతావరణం ఉందంటే వారి మధ్య ప్రేమ ఉందని అర్థం. ఒకరిపై ఒకరికి నమ్మకం.. భావోద్వేగం.. కోపం..
బాధ ఇలా ఇద్దరి మధ్య ఈ లక్షణాలు కనిపిస్తే వారు ప్రేమలో ఉన్నారని తెలుసుకోవాలి. అయితే ఒక్కోసారి వీరిమధ్య చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. కానీ నిజమైన ప్రేమ ఉంటే మాత్రం ఈ గొడవలు సమసిపోయి తిరిగి మళ్ళీ కలుసుకోగలుగుతారు. కానీ కొందరు తమ మధ్య ప్రేమ ఉందనే విషయం గుర్తించారు. ఇద్దరి మధ్య గొడవ ఏర్పడగానే ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకొని దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అయితే కొన్ని ప్రయత్నాల వల్ల తిరిగి వారు కలుసుకోవచ్చు. ఆ ప్రయత్నాలను ప్రేమ భాషల ద్వారా చేస్తే.. దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అసలు ప్రేమ భాషలు అంటే ఏమిటి? వీటిని ఎలా చూపించాలి?
ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటే అతని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఆ వ్యక్తి మనల్ని ద్వేషించినా కూడా.. వారిపై ప్రేమ కచ్చితంగా ఉంటుంది. తనపై ప్రేమ ఉందనే విషయాన్ని ప్రేమ భాష ద్వారా తెలియజేయాలి. అలాంటి ప్రేమ భాషల్లో కొన్ని..
సంతోషం
ఒక వ్యక్తి పై ద్వేషం కలిగినప్పుడు ఆ వ్యక్తితో కలిసి సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇలా సంతోషంగా జీవితం గడిపితే అతనిలో ఉన్న ద్వేషం కరిగిపోతుంది. ఆ తర్వాత అప్పటివరకు ఉన్న కోపం గురించి కాకుండా ఆ సంతోషం కోసమే కలిసి ఉంటారు. ఇలా మన సందర్భాల్లో సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తే వారి మధ్య బంధం బలపడి ఎప్పటికీ విడిపోకుండా ఉంటారు.
క్షమాపణ
ఇతర వ్యక్తుల మధ్య ఎంత స్వచ్ఛమైన ప్రేమ ఉన్నా.. ఒక్కోసారి కొన్ని విషయాల్లో మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఎవరు ఒకరు క్షమాపణ చెబితే మరొకరు క్షమించే గుణాన్ని అలవర్చుకుంటారు. ఒకసారి ఒకరు క్షమాపణ చెబితే.. మరొకరు ఇంకోసారి క్షమాపణ చెప్పేందుకు ముందుకు వస్తారు. ఇలా ఇద్దరి వ్యక్తుల మధ్య క్షమాపణలు ఉన్నట్లయితే వారి మధ్య నిజమైన ప్రేమ ఉందని అర్థం చేసుకోవాలి
బాధ
ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి కోసం బాధపడుతున్నామంటే.. ఆ వ్యక్తి పై నిజమైన ప్రేమ ఉందని తెలుసుకోవాలి. ఆ వ్యక్తికి ఎలాంటి అన్యాయం జరిగినా.. ఏదైనా సమస్య వచ్చినా.. వెంటనే తల్లడిల్లి పోతుంటారు కొందరు. అలా ఒకరి గురించి బాధపడుతున్నావంటే అతనిపై నిజమైన ప్రేమ ఉందని తెలుసుకోవాలి.
గతం
ప్రేమికుల మధ్య ఎన్నో తీయని అనుభూతులు ఉంటాయి. జ్ఞాపకాలు మిగిలిపోతాయి. కానీ కొన్ని సందర్భాల్లో వీరి మధ్య ద్వేషం ఏర్పడినప్పుడు.. గతం లో జరిగిన తీపి సంఘటనలు.. మధురమైన జ్ఞాపకాలను నెమరేసుకుంటే.. వారి మధ్య ప్రేమ బలపడుతుంది. దీంతో బంధం దూరం కాకుండా ఉంటుంది.
ఇవే కాకుండా మరెన్నో విషయాలను ఎవరో ఒకరు తమ ఫీలింగ్ ద్వారా వ్యక్తపరిస్తే ఎదుటివారు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒకరిపై నిజమైన ప్రేమ ఉంటే వారిని ఎప్పటికీ విడిచి పెట్టుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి.