స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్‌లో దూసుకెళుతోంది ఆషికా రంగనాథ్. మంగళవారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా తను నటిస్తున్న 'విశ్వంభర' చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఇందులో ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో ఆషికా కూల్‌గా కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తోంది. చిరంజీవి హీరోగా వశిష్ట రూపొందిస్తున్న ఈ చిత్రంలో త్రిషతోపాటు ఆమె సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఆషికా పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దీంతోపాటు రవితేజ హీరోగా కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో రూపొందుతోన్న చిత్రంలో ఆషికా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే తమిళంలో 'సర్దార్2' చిత్రంలో కార్తి సరసన కనిపించనుంది. ఓ కన్నడ సినిమాను కూడా ఆమె కంప్లీట్ చేసింది.