Peddi Telugu Movie: మెమోరబుల్‌గా రాంచరణ్‌, జాన్వీకపూర్‌ సాంగ్‌.. పెద్ది టీం క్రేజీ న్యూస్..!


 

Peddi | తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి పెద్ది (Peddi). రాంచరణ్‌ (Ram Charan) లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రానికి ఉప్పెన ఫేం బుచ్చి బాబు సాన దర్శకత్వం వహిస్తున్నాడు.

బుచ్చిబాబు సినిమా అంటే హీరోయిన్ పాత్రలు బలమైన భావోద్వేగాలు, ఎఫెక్టివ్‌గా ఉంటాయని తెలిసిందే.


ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ రాంచరణ్‌ ప్రియురాలిగా కనిపించనుంది. ఇప్పటివరకు ఒకే ఒక పాట షూట్‌ చేయగా.. త్వరలోనే రాంచరణ్‌, జాన్వీకపూర్‌పై వచ్చే మాంటేజ్ సాంగ్‌ను చిత్రీకరించనున్నారట మేకర్స్‌. ఈ పాట సినిమా కథను ముందుకు తీసుకెళ్లేలా సాగుతూ సరికొత్తగా ఉండబోతుందని ఇన్‌సైడ్‌ టాక్‌. మొత్తానికి రాంచరణ్‌, జాన్వీకపూర్‌ అందమైన రిలేషన్‌షిప్‌ను బుచ్చిబాబు సిల్వర్‌ స్క్రీన్‌పై ఎలా చూపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.


పాన్ ఇండియా రూరల్‌ స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్‌ శివ రాజ్‌ కుమార్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏఆర్‌ రెహమాన్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. పెద్ది మార్చి 27న 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో జగపతిబాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, వృద్ధి సినిమాస్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.