Anushka Shetty GHAATI Movie : ఘాటీ ట్రైలర్‌ విడుదల.. గంజాయి స్మగ్లర్‌గా షాకింగ్‌ లుక్‌లో హీరోయిన్‌ అనుష్క

 


Ghaati Trailer Review: వెండితెరపై అనుష్కను చూసి చాలా రోజులైంది. రెండేళ్ల కిందట ఓ సినిమాతో వచ్చినా సినిమా హిట్‌ కాకపోవడంతో అనుష్క సినీ పరిశ్రమకు దూరమైంది.

లేటయినా లేటెస్ట్‌గా వస్తానంటూ పవర్‌ ఫుల్‌ సినిమాతో అనుష్క వచ్చారు. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఘాటీ'లో ప్రధాన పాత్రలో అనుష్క మెరిశారు. విక్రమ్‌ ప్రభుతో జత కట్టిన అనుష్క నటించిన ఘాటి సినిమా ట్రైలర్‌ బుధవారం విడుదలైంది. ట్రైలర్‌లో అనుష్క పవర్‌ ఫుల్‌ పాత్రలో కనిపించారు. ఆ ట్రైలర్‌ ఎలా ఉంది? అనుష్కకు రీఎంట్రీ సక్సెస్‌ అవుతుందా? అనేది చూద్దాం.


అనుష్క శెట్టి, విక్రమ్‌ ప్రభు ప్రధాన పాత్రల్లో క్రిష్‌ తెరకెక్కించిన చిత్రం 'ఘాటి'. అటవీ ప్రాంతంలో నివసించే ఘాటీ అనే తెగకు సంబంధించిన చిత్రంగా ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ఘాటిల్లో ఒకరైన అనుష్క శెట్టి అక్కడ ఎదురైన పరిస్థితులు.. వాటిని ఎలా ధైర్యంగా ఎదుర్కొని తమ జాతి కోసం నిలబడ్డారనేది సినిమా కథగా తెలుస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన ట్రైలర్‌ అద్భుతంగా ఉంది.


సినిమా కోసం కొద్దిగా సన్నబడిన అనుష్క అటవీప్రాంతంలో నివసించే ఓ తెగ మహిళగా కనిపించింది. ఆ కట్టుబొట్టు అంతా అనుష్క సెట్టవగా.. విపత్కర సమయంలో అపరకాళిగా అనుష్క రెచ్చిపోయి నటించింది. గతంలో కంటే కొత్త లుక్‌లో అనుష్క ఈ సినిమాలో కనిపిస్తున్నారు. 'సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎలా ఉంటదో' అంటూ అనుష్క్‌ పవర్‌ఫుల్‌ పాత్ర అని చెప్పకనే చెబుతోంది. 'ఘాట్లలో ఘాటీలు ఉంటారు సార్‌' ట్రైలర్‌ో డైలాగ్స్‌, విజువల్స్‌ ప్రధాన ఆకర్షణ. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పాన్‌ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఘాటి సినిమా సెప్టెంబర్‌ 5వ తేదీన విడుదల చేయనున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సాగర్‌ నాగవల్లి సంగీతం అందిస్తున్నాడు.