- Movie: Nari Nari Naduma Murari
- Cast: Sakshi Vaidya,Samyuktha Menon,Sharwanand
- Music Director: Vishal Chandrasekhar
- Year: 2025
Song:
దర్శనమే మధురక్షణమే
నీవు నేను ఇక మనమే
మనసున మోగే మంగళ నాదస్వరమే
నాదాకా నిన్ను నడిపింది ప్రేమే
నువ్విల జతగా నడిచే
ప్రతి అడుగు పూల వనమే
నీతో పరిచయమే
పరిచయమే ప్రియ వరమే
ఇక నీతో ప్రతి నిమిషం
పరవశమే నాకు
నీతో పరిచయమే
పరిచయమే ప్రియ వరమే
ఇక నీతో ప్రతి నిమిషం
పరవశమే నాకు
నీ పెదాలకు మెరుపైన ఎరుపు నేనే
నీ పాదాలకు సిరి సిరి మువ్వనైన నేనే
నీ నీలి ముంగురుల ఉయ్యాలలూగానే
నీ వేలి ఉంగారమై వెయ్యేళ్లు నావేనే
నీ చూపు నేనే నీ రేపు నేనే
నీ యదలో కదిలి మెదిలే
ఆ సవ్వడైన నేనే
నీతో పరిచయమే
పరిచయమే ప్రియ వరమే
ఇక నీతో ప్రతి నిమిషం
పరవశమే నాకు
రాసి ఇవ్వనా నా నవ్వులన్ని నీకే
స్వీకరించనా నీ ప్రతి కంటి చెమ్మ నాకే
నా జంట నువ్వుంటే
వెన్నెల మధుమాసం
నీ తోడు లేకుంటే
వేసంగి వనమాసం
నా రామసీతా
నా ప్రేమ గీతా
నువ్విల జతగా నిలిచీ
నా కలలు పండెన్నంటా
దర్శనమే మధురక్షణమే
నీవు నేను ఇక మనమే
దర్శనమే మధురక్షణమే
మనసున మోగే మంగళ నాదస్వరమే
నాదాకా నిన్ను నడిపింది ప్రేమే
నువ్విల జతగా నడిచే
ప్రతి అడుగు పూల వనమే
నీతో పరిచయమే
పరిచయమే ప్రియ వరమే
ఇక నీతో ప్రతి నిమిషం
పరవశమే నాకు
నీతో పరిచయమే
పరిచయమే ప్రియ వరమే
ఇక నీతో ప్రతి నిమిషం
పరవశమే నాకు