Vijay Deverakonda's Kingdom Movie Trailer Out: యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న అవెయిటెడ్ మూవీ 'కింగ్‌డమ్'. ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ట్రైలర్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది.
ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ ట్రెండింగ్‌లో నిలవగా... ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
ట్రైలర్ ఎలా ఉందంటే?
ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఓ డిఫరెంట్ రోల్, రగ్డ్ మాస్ లుక్‌లో విజయ్ దేవరకొండ అదరగొట్టారు. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌లో పవర్ ఫుల్ డైలాగ్స్‌తో గూస్ బంప్స్ తెప్పించారు విజయ్. మూవీలో ఆయన గూఢచారిగా కనిపించనున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామాకు అన్నదమ్ముల సెంటిమెంట్ జోడించారు.
ఓ ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం అండర్ కవర్ స్పైగా విజయ్ దేవరకొండ మారడంతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. 'నీ ఫ్యామిలీ, అమ్మ, నాన్న, అందరినీ వదిలేయాలి. నువ్వు అడుగుపెట్టబోయే ప్రపంచం, నువ్వు కలవబోయే మనుషులు, నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితులు. చాలా రిస్కీ ఆపరేషన్ సూరి.' అంటూ చెప్పే డైలాగ్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఓ సాధారణ కానిస్టేబుల్ అండర్ కవర్ స్పైగా వెళ్లగా... ఆ గ్యాంగ్‌కు లీడర్ అతని అన్నే ఉంటాడని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది.