Ghatotkachudu Song: Andala Aparanji Bomma

 

  •  Movie:  Ghatotkachudu
  •  Cast:  Ali,Roja,Satyanarayana
  •  Music Director:  S. V. Krishna Reddy
  •  Year:  1995
  •  Label:  Aditya Music

Song:  Andala Aparanji Bomma






అందాల అపరంజి బొమ్మా అమ్మ లేదంటూ బెంగ పడకమ్మా కడుపారా నినుగన్న అమ్మా చూడలేదమ్మా నీ కంట చెమ్మా కనుమరుగునున్నా నిను మరువదమ్మా కన్నీరు తుడిచే కబురంపేనమ్మా చెబుతాను వినవమ్మా అందాల అపరంజి బొమ్మా అమ్మ లేదంటూ బెంగ పడకమ్మా ఆకలందంటే ఆ చిన్ని బొజ్జా అడగకుండానే తెలుసుకోమందీ ఆటాడుకోగా తోడెవ్వరంటే అంబారీగట్టీ ఆడించమందీ నీకేం కావాలన్నా నాకు చెబుతూ ఉంటానంది తానె లోకానున్నా నిన్ను చూస్తూ ఉంటానంది కాపాడుకుంటా కనుపాపలాగా నిను చూసుకుంటా నీ అమ్మలాగా నమ్మమ్మ నా మాటా అందాల అపరంజి బొమ్మా అమ్మ లేదంటూ బెంగ పడకమ్మా మావయ్యనంటూ నిను చేరమందీ మంచి మాటలతో మరిపించమందీ కథలెన్నో చెప్పి నవ్వించమందీ ఒడిలోన చేర్చి ఓదార్చమందీ జో జో పాపా అంటూ తానూ రోజూ పాడే లాలి ఇట్టా పాడాలంటూ నాకు తానె నేర్పింది తల్లి మా పాపానిపుడూ కాపాడమంటూ దేవుణ్ణి అడిగి దీవెనలు తెచ్చే పని మీద వెళ్ళింది అందాల అపరంజి బొమ్మా అమ్మ లేదంటూ బెంగ పడకమ్మా కడుపారా నినుగన్న అమ్మా చూడలేదమ్మా నీ కంట చెమ్మా కనుమరుగునున్నా నిను మరువదమ్మా కన్నీరు తుడిచే కబురంపేనమ్మా చెబుతాను వినవమ్మా అందాల అపరంజి బొమ్మా అమ్మ లేదంటూ బెంగ పడకమ్మా