Gudumba Shankar 2004 Song Chitti Nadumune Choostunna

 చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలో చస్తున్నా కంటపడదు ఇక ఎదురేమున్నా

చుట్టుపక్కలేమౌతున్నా గుర్తుపట్టనే లేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా
నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే జానా అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా
ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పుచేసైనా

నంగనాచిలా నడుమూపి నల్లత్రాచులా జడ చూపి తాకి చూస్తే కాటేస్తానంది
చీమలాగా తెగ కుడుతుంది పాము లాగా పగ పడుతుంది కళ్ళు మూసినా ఎదరేవుంది
తీర చూస్తే నలక అంత నల్లపూస  ఆరా తీస్తే నను నమిలేసే ఆశా
కన్నెరగా కందిదిలా నడువొంపుల్లో నలిగీ 
ఈ తికమక తేలేదెలా ఆ సొంపుల్లో మునిగీ

ఎన్ని తిట్టినా వింటానే కాలదన్నినా పడతానే నడుము తడమనీ నన్నొకసారీ
ఉరిమి చూసినా ఓకేనే ఉరే వేసినా కాదననే ఉరిమి చెవిని చెబుతానే సారీ
హాయిరే హాయిరే ఏ ప్రాణ హాని రానీ హాయిరే హాయిరే ఇక ఏమైనా కానీ
నిను నిమరక నా పుట్టుక పూర్తవదు కదా అలివేణీ
ఆ కోరిక కడతీరగ మరుజన్మ ఎందుకే రాణీ