Devadasu 1953 song Jagame Maya

 

జగమే మాయ బ్రతుకే మాయ 
వేదాలలో సారమింతేనయా (3)

కలిమి లేములు కష్టసుఖాలు 
కావడిలో కుండలనీ భయమేలోయీ
కావడి పోయ్యేనోయ్ కుండలు మన్నేనోయి
కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయీ/ జగమే

ఆశ మొహముల దరి రానికోయి(2)
అన్యులకే నీ సుఖము అంకితమోయి(2)
బాధ సౌఖ్యమనే భావన రానివోయ్
ఆ ఏరుకే నిత్య ఆనందమోయ్, బ్రహ్మానందమోయి