ఆ మబ్బు తెరలలోనా దాగుంది చందమామ
ఈ సిగ్గు తెరలలోనా బాగుంది సత్యభామ
ఏమంది సత్యభామ
ఏమందో ఏమో గాని పరిహాసాలే చాలునండి
శ్రీవారిని ఐదారడుగుల దూరాన ఆగమంది
దూరాన ఆగమంది
ఈ గాలి ఊయల ఊగింది పైఎద
ఈ గాలి ఊయల ఊగింది పైఎద
ఊరించే సైగలతోనే ఏమంది తీయగా
పరువాల తొందర నెలరాజు ముందర
పరువాల తొందర నెలరాజు ముందర
మర్యాద కాదని తానే పలికింది మెల్లగా
పలికింది మెల్లగా
ఆ మబ్బు తెరలలోనా దాగుంది చందమామ
ఈ సిగ్గు తెరలలోనా బాగుంది సత్యభామ
ఏమంది సత్యభామ
ఏమందో ఏమో గాని పరిహాసాలే చాలునండి
శ్రీవారిని ఐదారడుగుల దూరాన ఆగమంది
దూరాన ఆగమంది
సిగలోనా పువ్వూలు చిలికించే నవ్వులూ
సిగోనా పువ్వులూ చిలికించే నవ్వులూ
మనకోసం ఏ సందేశం అందించే ప్రేయసి
ఆనంద సీమలో అనురాగ డోలలా
కలకాలం చెల్లిపోని ఆడాలి హాయిగా
అందాలి తీయగా
ఆ మబ్బు తెరల పైనే ఆడింది చందమామ
ప్రేమికుల హృదయం తెలిసి పాడింది చందమామ