Bhanumathi Movie Song Shranam nee divya charanam

  

శరణం నీ దివ్య చరణం  నీ నామమెంతొ మధురం

శరణం నీ దివ్య చరణం  నీ నామమెంతొ మధురం

  శ్రీ శేషశైలవాసా

శరణం నీ దివ్య చరణం  నీ నామమెంతొ మధురం

శ్రీ శేషశైలవాసా 

 శరణం నీ దివ్య చరణం శ్రీ చరణం 

 

 

భక్తుల బ్రోచే స్వామివి నీవే

 పేదలపాలిటి పెన్నిధి నీవే  

భక్తుల బ్రోచే స్వామివి నీవేపేదలపాలిటి పెన్నిధి నీవే

 సకల జీవులను చల్లగ చూచే 

 సకల జీవులను చల్లగ చూచేకరుణామయుడవు నీవే

శరణం నీ దివ్య చరణం  నీ నామమెంతొ మధురం

శ్రీ శేషశైలవాసా 

 శరణం నీ దివ్య చరణం శ్రీ చరణం

 

 

  త్రేతాయుగమున శ్రీరాముడవై 

ద్వాపరమందున గోపాలుడవై

త్రేతాయుగమున శ్రీరాముడవై  ద్వాపరమందున గోపాలుడవై

  ఈ యుగమందున వెంకటపతివై 

ఈ యుగమందున వెంకటపతివై  భువిపై వెలసితివీవే

శరణం నీ దివ్య చరణం  నీ నామమెంతొ మధురం

శ్రీ శేషశైలవాసా 

 శరణం నీ దివ్య చరణం శ్రీ చరణం

 

   నీ ఆలయమే శాంతికి నిలయం 

నిను సేవించే బ్రతుకే ధన్యం

నీ ఆలయమే శాంతికి నిలయం  నిను సేవించే బ్రతుకే ధన్యం

   తిరుమలవాసా శ్రీ వేంకటేశా

తిరుమలవాసా శ్రీ వేంకటేశా  మా ఇలవేలుపు నీవే 


శరణం నీ దివ్య చరణం  నీ నామమెంతొ మధురం

శ్రీ శేషశైలవాసా 

                              శరణం నీ దివ్య చరణం శ్రీ చరణం