Baahubali Movie Song Pacha Bottesina

                             పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే                                                       పంచుకుంటానురా

జంటకట్టేసిన తుంటరోడా నీతో కొంటె తంటాలనే తెచ్చుకుంటానురా
వేయి జన్మాలా ఆరాటమై, వేచి ఉన్నానే నీ ముందరా
చేయి నీ చేతిలో చేరగా... రెక్క విప్పిందే నా తొందరా
పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా

మాయగా నీ సోయగాలాలు వేసిీ
నన్నిలా లాగింది నువ్వే హలా..
కబురులతో కాలాన్నీ కరిగించే వ్రతమేలా
హత్తుకుపో నను ఊపిరి ఆగేలా
బహుబంధాల పొత్తుల్లలో విచ్చుకున్నావే ఓ మల్లికా..
కోడె కౌగిళ్ళ పొత్తిళ్ళలో పురివిప్పింది నా కోరికా
పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా

కానలో నువ్ నేను ఒక మేను కాగా
కోనలో ప్రతి కూన మురిసేనుగా
మరక్షణమే ఎదరైనా.. మరణము కూడా పరవశమే
సాంతము నే నీసొంతం అయ్యాకా
చెమ్మ చేరేటి చెక్కిల్లలో చిందులేసింది సిరివెన్నెలా
ప్రేమ ఊరేటి నీ కళ్ళలో రేయి కరిగింది తెలి మంచులా
పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంటకట్టేసిన తుంటరోడా నీతో కొంటె తంటాలనే తెచ్చుకుంటానురా