Akbar Saleem Anarkali Movie Song Sipaayee Sipaayee

 సిపాయిీ... సిపాయీ... సిపాయీ...సిపాయీ..

నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో...
నా వాలు కనులడుగు  అడుగు చెబుతాయిీ...
సిపాయీ ఓఓ... సిపాయీ

హసీనా... హసీనా....
నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో...
ఈ పూల మనసునడుగు అడుగు ఇకనైనా...
హసీనా..ఓఓ..హసీనా...

జడలోని మల్లెలు జారితే
నీ ఒడిలో ఉన్నాననుకున్నా...
చిరుగాలిలో కురులూగితే 
చిరుగాలిలో కురులూగితో 
నీ చేయి సోకేనని అనుకొన్నా...

ఆ... మల్లెలలో కదలాడినవి నా కలవరింపులే
ఆ గాలిలో చెలరేగినవి ఆ... గాలిలో చెలరేగినవి
నా నిట్టూరుపులే..
హసీనా...ఓఓ..హసీనా
నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో
ఈ వాలు కనులనడుగు అడుగు చెబుతాయీ...
సిపాయీ...ఓఓ...సిపాయీ

గడియిసకన గీసిన గీతలు
అలతాకితే మాసిపోతాయిీ
ఎదలోన వ్రాసిన లేఖలు
ఎదలోన వ్రాసి లేఖలు
బ్రతుకంతా ఉండి పోతాయి
ఆ...లేఖలలో ఉదయించినవి నా భాగ్యరేఖలే....
మన ఊపిరిలో పులకించినవి
మన ఊపిరిలో పులకించిని
వలపు వాకలే.....
సిపాయీ సిపాయీ సిపాయీ సిపాయీ
నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో...
ఈ పూల మనసునడుగు అడుగు చెబుతాయీ...
హసీనా..ఓఓ..హసీనా
సిపాయీ...ఓఓ...సిపాయీ..
హసీనా హసీనా..ఓఓ..హసీనా...