TELUGU MOVIE SONGS 7/G

  కలలు గనే కాలాలు కరిగిపోవు సమయాలు

కలలు గనే కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోనీ ముగ్గే వేయునా ఆ ఆ ఆ .......
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా

ఇది చేరువ కోరే తరుణం ఇరు ఎదలలో మెల్లని చలనం
ఇక రాత్రులు ఇంకొక నరకం వయసులా అతిశయం
ఇది కత్తిన నడిచే పరువం నిజ కలలతో తమకమ రూపం
వెళ్ళి కోరును నిప్పుతో స్నేహం దేవుని రహస్యము
లోకం లో తియ్యని భాషా శలయం లో పలికే భాషా
మెలమెల్లగ వినిపించే ఘోషా ఆ ఆ ఆ .....
కలలు గనే కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా


తడికాని కాళ్ళతోటీ కడలికేది సంభంధం
నే వేరు నువ్వేరంటే చెలిమికేది అనుభంధం
ఎగరలేని పక్షికేలా పక్షి అనెడి ఆ నామం
తెరవలేని మనస్సుకేలా కలలుగనే ఆరాటం
ఒంటరిగా పాదాలు ఏమి కోరి సాగినవో
జ్యోతి వెలిగించిన చేతి కొరకు వెతికినవో
కల్లోన కొన్ని హద్దులు ఉండును స్నేహం లో అవి ఉండవులే
ఎగిరొచ్చే కొన్ని ఆశలు దూకితే ఆపుట ఎవరికి సాధ్యములే


కలలు గనే కాలాలు కరగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గులే వేయునా
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా

ఏమైందో ఏమో గాలికి తేమ కాస్త తగ్గెనులే
ఏకాంతం పూసుకొని సంధ్య వేళ పిలిచెనులే
తెల్లవారు ఘాముల్లన్నీ నిద్రలేక తెలవారే
కనులు మూసి తనలో తానే మాట్లాడ తొచెనులే
నడిచేటి దారిలో నీ పేరు కనిపించి
గుండేల్లో ఏవో గుసగుసలు వినిపించె
అపుడపుడు చిరు కోపం రాగా నలిగెను ఎందుకు అంచులారా
భుకంపం అది తట్టుకోగలము అధికంపం అది తట్టుకోలేం

కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గులే వేయునా
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా