Telugu Movie Annamayya

అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని

 అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని

అంతర్యామి అలసితి సొలసితి...

కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక
కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక
భారపు పగ్గాలు పాపపుణ్యములు
భారపు పగ్గాలు పాపపుణ్యములు నేరుపున బోవు నీవు వద్దనక

అంథర్యామి||

మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక
మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక
ఎదుటనె శ్రీవేంకటేశ్వర వేంకటేశా శ్రీనివాస ప్రభూ..
ఎదుటనె శ్రీవేంకటేశ్వర నీ వదె అదన గాచితివి అట్టిట్టనక

అంతర్యామి|